ఓ కొత్త విజయ్ ని చూస్తారు అంటున్న టాలెంటెడ్ డైరెక్టర్.

తలపతి విజయ్ నుండి వస్తున్న మరో క్రేజీ మూవీ మాస్టర్. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. చెన్నై వేదికగా నిన్న ఈ మూవీ ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కనకరాజ్ స్పీచ్ ఆసక్తికరంగా సాగింది. చిత్ర విజయం ఫై గట్టి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసిన ఆయన ఈ సినిమాలో మీరు ఓ కొత్త విజయ్ ని చూస్తారంటూ అంచనాలు పెంచేశారు.

విజయ్ ఈ మూవీలో కాలేజ్ లెక్చరర్ గా, మాఫియా నేపథ్యం కలిగిన వ్యక్తిగా రెండు భిన్న షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం మరో విశేషం. తెరపై వీరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం అని వినిపిస్తుంది. మాస్టర్ మూవీ తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుండగా అనిరుధ్ సంగీతం అందించారు.

Exit mobile version