పవన్ సినిమా విషయంలో క్రిష్ ఇంకా చెప్పనిదే..!?

ప్రస్తుతం మన టాలీవుడ్ లో పాన్ ఇండియన్ సినిమాల హవా మరింత స్థాయిలో ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో ఒక్క మన టాలీవుడ్ నుంచే పదికి పైగా సినిమాలు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యాయి. అయితే మన స్టార్ హీరోలలో మాత్రం ఇంకా ఊహాగానాలే అని చెప్పాలి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తన 27 వ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం పవన్ ఒప్పుకున్నా మూడు అధికారిక సినిమాల్లో ఇదే మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ అని చెప్పాలి.

పైగా పీరియాడిక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా విషయంలో ఒక్క విషయంపై ఇంకా ఓ సరైన క్లారిటీ రాలేదు. అదే ఈ సినిమా పాన్ ఇండియన్ చిత్రంగా విడుదల అవుతుందా లేదా అన్నది పవన్ అభిమానులను ఎంతగానో తొలిచేస్తున్న ప్రశ్న. దీనితో ఈ చిత్రం పాన్ ఇండియన్ ప్రాజెక్టా కాదా అన్నది ఇంకా ఖరారు కాలేదు. సో ఈ ఒక్క అంశంలో మాత్రం క్రిష్ ఏది అన్నది కన్ఫర్మ్ చేసే వరకు ఓ తుది నిర్ణయానికి రాకూడదు. మరి క్రిష్ ఏం చెప్తారో చూడాలి.

Exit mobile version