టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తల్లి తండ్రులకు కారు ప్రమాదం జరిగింది. వీరు హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళుతుండగా మెదక్ జిల్లా ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మాకున్న సమాచారం ప్రకారం వారికి పెద్దగా ఏమీ కాలేదు, స్వల్ప గాయాలతోనే ప్రమాదం నుండి బయటపడ్డారు. దిల్ రాజు తల్లి తండ్రులైన శ్యాం సుందర్ రెడ్డి మరియు ప్రమీలమ్మలను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
ప్రస్తుతం దిల్ రాజు వెంకటేష్ – మహేష్ బాబు కాంబినేషన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ఎన్.టి.ఆర్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ చిత్రం మరియు రామ్ చరణ్ తో ‘ఎవడు’ సినిమాలు చేస్తూ నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్నారు.