నారా రోహిత్ కు దిల్ రాజు ప్రతినిధా?

నారా రోహిత్ కు దిల్ రాజు ప్రతినిధా?

Published on Jan 23, 2014 11:00 PM IST

Dil-Raju
నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి’ టీజర్ విడుదలచేసాక ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని సమాచారం. ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే ఆవేశ యువకుడిగా హీరో పాత్ర వుంటుంది. ఇప్పుడు ఈ సినిమా గురించి తెలిసిన ఆసక్తికర విషయం ఏమిటంటే దీనిని దిల్ రాజు సమర్పించనున్నాడు

ఈ సినిమా తనకు నచ్చిందని, అందుకే స్టేట్ మొత్తం తనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ వార్త ఇంకా అధికారికంగా ప్రకటించాల్సివుంది

సుధీర్ సినిమా బ్యానర్ పై సాంబశివరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ మండవ దర్శకుడు. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది

తాజా వార్తలు