ఈ రోజుల్లో క్రేజ్ క్యాష్ చేసుకుంటున్న దిల్ రాజు


చిన్న చిత్రంగా విడుదలైన ‘ఈ రోజుల్లో’ చిత్రం పెద్ద విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా డిస్ట్రిబ్యూషణ్ హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా చూసిన దిల్ రాజు ఆయనకు సినిమా బాగా నచ్చడంతో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకి వచ్చారు. ప్రస్తుతం కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదలైన ఈ చిత్రాన్ని మరికొన్ని థియేటర్లలో కలిపి విడుదల చేస్తున్నారు. శ్రీనివాస్, రేష్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ రోజుల్లో చిత్రాన్ని మారుతీ డైరెక్ట్ చేయగా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై తెరకెక్కింది. జేబీ సంగీతం అందించిన ఈ చిత్రం 5డి కెమేరాతో చిత్రీకరించారు.

Exit mobile version