మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎవడు’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు చాలా ఆనందంగా ఉన్నాడు. ఆదివారం ఈ సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి అలాగే రెండవ రోజు కూడా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ ప్రముఖ పాత్రలో నటించాడు.
ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో దిల్ రాజు తన అందాన్ని వ్యక్తం చేసాడు. ‘చాలా సమస్యల తర్వాత ఎవడు సినిమా సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలా చలా అరుదుగా జరుగుతుంది. నిర్మాతగా నా కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఎవడు అని’ అన్నాడు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.