ఘనంగా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. బెస్ట్ విషెస్ చెప్పిన దిల్ రాజు, ఆనంద్ దేవరకొండ

Dil Raju, Anand Devarakonda

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన “సంతాన ప్రాప్తిరస్తు” చిత్రం నవంబర్ 14న విడుదలకు సిద్ధమైంది. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మాట్లాడుతూ.. “ఫెర్టిలిటీ అనే సెన్సిబుల్ ఇష్యూను ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిపి ప్యూర్ లవ్ స్టోరీగా తీశాం. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.” అని అన్నారు.

నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. “ఇది క్యూట్ కాన్సెప్ట్ మూవీ. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో మంచి విజయాన్ని అందుకుంటుంది.” అని అన్నారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. “మేల్ ఫెర్టిలిటీ అనే కొత్త అంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్, ఎంటర్‌టైనింగ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా” అని అన్నారు.

హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నా పాత్ర నాకు చాలా స్పెషల్. సినిమా సెన్సిబుల్‌గా, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా ఉంటుంది.” అని అన్నారు.

ముఖ్య అతిథిగా వచ్చిన ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. విక్రాంత్-చాందినీ జంట బాగా నచ్చింది. సంజీవ్‌కు ఈ చిత్రంతో మంచి హిట్ రావాలని కోరుకుంటున్నా. మధుర శ్రీధర్ గారు నా కెరీర్‌లో కీలక పాత్ర పోషించారు. ఆయనకు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావాలి” అని అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. “ఈ టైటిల్ నేటి సమాజానికి సరిగ్గా సరిపోతుంది. టీమ్ మొత్తం అద్భుతంగా పనిచేసింది. సినిమా నిజమైన విజయాన్ని అందుకోవాలంటే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి. కంటెంట్ బాగుంటే విజయం ఖాయం” అన్నారు.

Exit mobile version