ఆ పుకార్లను నమ్మకండి.!

ఆ పుకార్లను నమ్మకండి.!

Published on Oct 16, 2012 9:13 AM IST

సినీ అభిమానులను మరియు ఇప్పుడే ఎదుగుతున్న యువ దర్శకులను నిరాశపరిచేలా డిజిటల్ మూవీ ప్రొడక్షన్ ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిలిపివేస్తోందనే ఒక వార్త గత కొద్ది రోజులుగా బాగా వినిపిస్తోంది. తెలుగు డైరెక్టర్స్ అసోషియేషన్ ప్రతినిధి అయిన మద్దినేని రమేష్ ‘ డిజిటల్ మూవీ ప్రొడక్షన్ నిలిపి వేస్తాం అని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని’ ఆయన తెలియజేశారు.

ఈ రోజు హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ ‘ ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న యువ దర్శకులు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలకు కలెక్షన్లు తక్కువగానే ఉంటున్నాయి. ఇటీవలే వర్కర్స్ యూనియన్ వారు ఒక సినిమాకి వారికి అవసరమున్నా లేకపోయినా ఖచ్చితంగా ఇంత మందిని పనిలో పెట్టుకోవాలనే డిమాండ్ ని కోరారు. వర్కర్స్ యునియన్ మెంబర్స్ మరియు మేము కలిసి సినిమాకి సంబంధించి ఎలాంటి నిభందనలు పెట్టడం లేదని మరియు ఎలాంటి టెక్నాలజీని నిలిపివేయడం లేదని నిర్దారించాము. అలాగే దర్శకులు ఎంత మందినైనా సినిమాకి తీసుకోవచ్చు కానీ వర్కర్స్ యూనియన్లో సభ్యలను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించామని’ ఆయన తెలిపారు.

డైరెక్టర్స్ యూనియన్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది, దీని వల్ల చిన్న సినిమాలు తీసే వారికి ఎంతో మేలు కలుగుతుంది మరియు చిన్న సినిమాలు కూడా తెరపైకి వస్తాయి.

తాజా వార్తలు