ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”కు సంభందించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను చిత్ర యూనిట్ వారు అందిస్తున్నారు. అలా ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ లేటెస్ట్ గా ఓ ఆసక్తికర అంశాన్ని కూడా ముందుంచారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తాయని తెలిపారు.
ఇపుడు అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో డార్లింగ్ మేకోవర్ కాస్త ఆశ్చర్యకరంగానే ఉండనుంది అని చెప్పాలి. నిన్న లేటెస్ట్ గా బయటకొచ్చిన ప్రభాస్ లుక్స్ ను కనుక కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభాస్ స్కిన్ టోన్ ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా కాస్త పింకీస్ గా కనిపిస్తుంది.
ఇందులో ప్రభాస్ చాలా ఆకర్షణీయంగా కనిపించారు. దీనితో రాధే శ్యామ్ లో ప్రభాస్ లుక్స్ చాలా స్టన్నింగ్ గా మరియు ఇంప్రెసివ్ గా ఉండడం ఖాయం అని చెప్పాలి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.