ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ మరియు కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా ‘ధూమ్ 3’ ఈ సినిమా షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది
హిందీ మాతృకలో రూపొందిన ఈ సినిమా తెలుగులోకి అనువాదమవ్వనుంది. హిందీ, మరియు తెలుగు భాషలలో ఒకేసారి ఈ సినిమా విడుదలకానుంది.ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు. దీనికి విశేష స్పందన రావడం గమనార్హం. ఈ సినిమాలో చాలావరకు యాక్షన్ సన్నివేశాలను అమెరికాలో చికాగో ప్రాంతంలో తీసారు.
ఈ సినిమాను విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తున్నారు. ప్రీతమ్ సంగీత దర్శకుడు. యష్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.