ట్రైలర్ టాక్: ‘ఇడ్లీ కొట్టు’తో ధనుష్ నుంచి మరో ఎమోషనల్ రైడ్!

ట్రైలర్ టాక్: ‘ఇడ్లీ కొట్టు’తో ధనుష్ నుంచి మరో ఎమోషనల్ రైడ్!

Published on Sep 20, 2025 8:00 PM IST

Idli-Kottu

కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ ఆల్రెడీ ఈ ఏడాదిలో కుబేర సినిమాతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన దర్శకత్వంలోనే నటించిన చిత్రం “ఇడ్లీ కడై”. దీనినే తెలుగులో “ఇడ్లీ కొట్టు” పేరిట తెరకెక్కించిన ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ ని ఇపుడు రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ తో ధనుష్ మరోసారి ఒక ఎమోషనల్ రైడ్ ని తీసుకొస్తున్నాడు అని చెప్పాలి.

ప్లెజెంట్ పల్లెటూరు వాతావరణంలో అమ్మానాన్నల ఎమోషనల్ సన్నివేశాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే రీతిలో తాను ఈ సినిమాని ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. జీవితంలో ఎక్కడికి వెళ్లినా కూడా తిరిగి తాను ఆరంభం అయ్యిన చోటుకే రావాలి అనే పాయింట్ అలాగే తన నాన్నకి ఇడ్లీ కొట్టు ఎందుకు అంత స్పెషల్, చేత్తో చేసే వంటకి ,మెషిన్ తో చేసే వంటకి వచ్చే రుచి లాంటి అంశాలు ఇంట్లో పెద్దలకి కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి.

ఇక ధనుష్ ఓ సింపుల్ ఘర్షణ కూడా ఇందులో డిజైన్ చేసుకున్నాడు. ఇది ఒకింత రొటీన్ గానే ఉన్నప్పటికీ వర్కౌట్ అవ్వొచ్చు అని కూడా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ నిత్యా మీనన్ రోల్ కూడా బాగుంది. మొత్తానికి మాత్రం తన నుంచి మరో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా వస్తుంది. ఇదెలా ఉంటుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు