త్వరలో “దమ్ము” సెన్సార్

త్వరలో “దమ్ము” సెన్సార్

Published on Apr 17, 2012 8:15 AM IST


మా వద్ద ఉన్న తాజా సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “దమ్ము” ఈ నెల 20 కాని 21న కాని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోనుంది. నిన్న మేము చెప్పిన విధంగా ఈ చిత్రం ప్రస్తుతం డి.ఐ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్ర మొదటి కాపీ మరో రెండు రోజుల్లో తయారవుతుంది. నిర్మాణేతర కార్యక్రమాల చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 27న భారీ విడుదల కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం “సింహ” అంత విజయం సాదిస్తుందని అనుకుంటున్నారు.ఎం ఎం కీరవాణి అందిచిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఈ చిత్ర ఆడియో ఇప్పటికే మంచి పేరు సంపాదించింది. త్రిష మరియు కార్తీక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీయార్ తల్లిగా భాను ప్రియ గారు కనిపించనున్నారు. ఏ. వల్లభ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కే.ఎస్.రామ రావు సమర్పిస్తున్నారు

తాజా వార్తలు