చివరి దశకు చేరుకున్న దమ్ము షూటింగ్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దమ్ము చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినమలోని చివరి పాట చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. ఎన్టీఆర్ తో పాటుగా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న త్రిషా, కార్తీకతో పాటుగా రచనా మౌర్య మరియు మరియమ్ జకారియ కూడా ఈ పాటలో ఆడి పాడుతున్నారు. ఏప్రిల్ ద్వితీయార్ధంలో విడుదల కానున్న ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ కూడా ఈ సినిమా పై అంచనాలను పెంచేలా చేసింది. ఇండస్ట్రీ వర్గాల నుండి కూడా పాజిటివ్ రిపోర్ట్ వస్తుండటంతో అందరి దృష్టి ఈ సినిమా పై పడింది. ఈ త్రైలేర్ యూట్యూబ్లో ఒక కోటి ఇరవై లక్షల మంది చూసారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు.

Exit mobile version