త్వరలో దమ్ము మొదటి కాపీ రెడీ


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ నెల 27న విడుదలవుతున్న ఈ చిత్ర మొదటి కాపీ 16న సిద్ధమవుతుందని విశ్వసనీయ సమాచారం. అన్ని హంగులు పూర్తి చేసుకుని సెన్సార్ సభ్యుల ముందుకు ఈ నెల 20న వెళుతుంది. భారీ స్తాయిలో అంచనాలున్న ఈ చిత్రం పై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. త్రిషా, కార్తీక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించాయి.

Exit mobile version