నక్సలైట్ల డ్రామా నేపధ్యంలో తెరకెక్కించిన ‘దళం’ సినిమా హైదరాబాద్ మరియు మల్టీ ప్లేక్స్ ప్రేక్షకులనుండి మంచి స్పందనను అందుకుంటుంది. రాజీపడని సాంకేతిక విలువలు, గుర్తుండిపోయే సంభాషణలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కానీ బి, సి సెంటర్ల ప్రేక్షకులను మాత్రం ఇవేవి థియేటర్లకు రాబట్టలేకపోతున్నాయి
ఆర్.జి.వి స్కూల్ కు చెందిన జీవన్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు సుమంత కుమార్ రెడ్డి నిర్మాత. ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర హీరో, పియా భాజ్ పై హీరోయిన్. జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించాడు
పోలీసుల మరియు రాజకీయనాయకుల తీరుతో విసిగిన ఎక్స్ నక్సలైట్లు మరోసారి ఆయుధం పడితే ఎలావుంటుంది అనేది ఈ చిత్ర కధ