పూరి జగన్నాధ్ త్వరలో చేయబోయే ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతుంది. మొదటగా ఇదే పేరుతో 1973 లో పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై వచ్చింది. ఎన్టీఆర్ మరియు కృష్ణ ముఖ్య పాత్రలు పోషించగా వి. రామచంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ చిత్రం విజయవాడ మరియు నెల్లూరులో 175 రోజులు పైగా ఆది రికార్డు సృష్టించింది. 16 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించారు. ఈ చిత్ర టైటిల్ ను మళ్లీ వాడుకుంటున్న పూరీ మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తా అంటున్నాడు. ఈ చిత్రం మళ్లీ చరిత్ర పునరావృతం చేస్తుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది.