ఓటిటి సమీక్ష: రీతూ వర్మ ‘దేవిక & డానీ’ – తెలుగు సిరీస్ జియో హాట్ స్టార్ లో

ఓటిటి సమీక్ష: రీతూ వర్మ ‘దేవిక & డానీ’ – తెలుగు సిరీస్ జియో హాట్ స్టార్ లో

Published on Jun 6, 2025 7:03 PM IST

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూన్ 06, 2025
స్ట్రీమింగ్‌ వేదిక : జియో హాట్‌స్టార్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : రీతు వర్మ, సూర్య వసిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్ మరియు ఇతరులు
దర్శకుడు : బి.కిషోర్
నిర్మాత : సుధాకర్ చాగంటి
సంగీత దర్శకుడు : జై క్రిష్
సినిమాటోగ్రాఫర్ : వెంకట్ సి దిలీప్
ఎడిటర్ : కార్తికేయ రోహిణి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రీతూ వర్మ అలాగే సూర్య వశిష్ఠ అలాగే శివ కందుకూరి కలయికలో ‘శ్రీకారం’ సినిమా దర్శకుడు బి కిషోర్ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘దేవిక & డానీ’ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక లోకల్ టీచర్ గా పని చేసే నెమ్మదైన అమ్మాయి దేవిక (రీతూ వర్మ) ఆమె విషయంలో బాగా పొసెసివ్ గా ఉండే జగ్గూ (సుబ్బరాజ్) ని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది. అయితే జగ్గూ ప్రవర్తన మాత్రం ఆమెతో ఉండే మిగతావారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె జగ్గూతో పెళ్ళికి ముందు మరొకరితో ప్రేమలో పడే అవకాశం ఉందని ఓ పూజారి చెబుతాడు. దీనిని ఆమె తల్లిదండ్రులు కొట్టి పారేస్తారు కానీ ఆమె లైఫ్ లోకి డానీ అనే ఒక అజ్ఞాత వ్యక్తి పరిచయం అవుతాడు. అక్కడ నుంచి ఆమె లైఫ్ ఎలా మారింది? పూజారి చెప్పిన ప్రేమికుడు ఇంతనేనా? అసలు డానీ గత ఏమిటి? ఆమెకు మాత్రమే ఎందుకు అతను కనిపిస్తాడు? అతను ఏ సహాయం ఆమెని కోరుతాడు? చివరికి వారేం చేశారు?ఈ మొత్తంలో దుర్గ ఎవరు? దేవిక ఎవరిని పెళ్లి చేసుకుంది అనే ఆసక్తికర ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

దాదాపు ప్రస్తుతం ఓటిటి లలో బాగా అడల్ట్ కంటెంట్ ఇంకా బోల్డ్ షోలే కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటివి కుటుంబంతో కూర్చొని చూసేందుకు పనికిరావు. మరి వాటిలా కాకుండా క్లీన్ గా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే క్లీన్ సిరీస్ ఇది చెప్పవచ్చు. ఎక్కడా పెద్దగా డొంక తిరుగుడు లేకుండా ఉన్న పాయింట్ ని దర్శకుడు నేరుగా చెప్పే ప్రయత్నం ఇందులో హార్ధనీయం అని చెప్పవచ్చు.

ఇక లీడ్ నటీనటుల్లో రీతూ వర్మకి మరోసారి తనకి తగ్గ సింపుల్ అండ్ హంబుల్ రోల్ దక్కింది అని చెప్పాలి. సినిమాల్లో ఇది వరకు చూసాం కానీ తన ఓటిటి డెబ్యూని కూడా ఆమె నీట్ గా డిజైన్ చేసుకుంది. దేవిక పాత్రలో చాలా నాచురల్ పెర్ఫామెన్స్ తో ఆమె మెప్పిస్తుంది. ఇక నటుడు సూర్య వశిష్ఠ మంచి రోల్ ని చేసాడని చెప్పాలి.

మంచి స్క్రీన్ స్పేస్ తో హ్యాండ్సమ్ లుక్స్ తో డానీ గా డీసెంట్ పెర్ఫామెన్స్ ని మంచి ఎమోషన్స్ తో కనబరిచాడు. ఈ సిరీస్ లో మరో ముఖ్యపాత్రదారుడు సుబ్బరాజ్ కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించాడు. తనకి ఈ తరహా పాత్రలు భలే సూట్ అవుతాయి. కోపంలో కూడా తన కామెడీ టైమింగ్ ఈ సిరీస్ లో రిలీఫ్ గా ఉంటుంది. ఇక వీరితో పాటుగా ఇతర నటీనటులు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సిరీస్ ఒకింత స్మూత్ గానే వెళ్లినప్పటికీ మరీ అంత ఎగ్జైటింగ్ గా అయితే సాగదు అని చెప్పవచ్చు. అలాగే కీలక ట్విస్ట్ కథనంలో రివీల్ అయ్యాక మిగతా కథనం అంతా ఒకింత ఊహాజనితంగానే అనిపిస్తుంది. అలాగే ఇందులో మంచి బలమైన ఎమోషన్స్ తో కూడిన కథనం ఆశించే ఆడియెన్స్ కొంతమేర నిరాశ చెందవచ్చు.

అలాగే కొన్ని లాజిక్స్ కూడా సిల్లీగా అనిపిస్తాయి. మీకు పరిచయం లేని ఒక మనిషి సడెన్ గా పరిచయం అయ్యారు అక్కడ నుంచి తరచూ కలుస్తున్నారు. ఆ ప్రతిసారి అవతల మనిషి ఒకే కాస్ట్యూమ్ లో ఉన్నపుడు మినిమమ్ డౌట్ ఎందుకు ఒకే డ్రెస్ లో ఉన్నావ్ అనేది వస్తుంది. కానీ దేవిక ఇలాంటి ప్రశ్న డానీని ఒక్కసారి కూడా అడగదు.

అలాగే ఇంకొంతమంది ప్రముఖ నటులు హర్ష చెముడు, సోనియా సింగ్ ఇంకా శివ కందుకూరి లాంటివారు తమ పాత్రలతో మెప్పించలేకపోయారు. అలాగే నటి కోవై సరళ చాలా కాలం తర్వాత తెలుగు స్క్రీన్ పైకి వచ్చినప్పటికీ ఆమెపై ఎమోషనల్ పార్ట్ అంతగా ప్రభావం చూపించాడు. దీనిని ఇంకొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక వర్గం:

ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చాగంటి సుధాకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సిరీస్ ని నిర్మాణం వహించారు. వెంకట్ సి దిలీప్ ఇచ్చిన కెమెరా విజువల్స్ బాగున్నాయి. అలాగే జై కృష్ణ సంగీతం బాగుంది. కార్తికేయన్ ఎడిటింగ్ కూడా బానే ఉంది. ఇంకొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే సిరీస్ మరింత ఎఫెక్టీవ్ గా ఉండేది.

ఇక దర్శకుడు బి కిషోర్ విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో ఓటిటిలలో వస్తున్నా బోల్డ్ కంటెంట్స్ కి అతీతంగా తాను తీసుకున్న క్లీన్ లైన్ బాగుంది. తాను చెప్పాలి అనుకున్న పాయింట్ ని దాదాపు బాగానే నడిపించారు కానీ ఇంకొంచెం బెటర్ గా కూడా ట్రై చేస్తే బాగుండేది. ఎమోషన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసి ఉంటే ఈ సిరీస్ మరింత ప్రభావం చూపించి ఉండేది. అయినప్పటికీ తన వర్క్ ఈ సిరీస్ కి మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘దేవిక & డానీ’ సిరీస్ ఒక క్లీన్ అండ్ సింపుల్ గా సాగే డీసెంట్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. లీడ్ నటీనటులు బాగా చేశారు. పెద్దగా డీవియేషన్స్ లేకుండా దర్శకుడు కథని చెప్పిన తీరు ఈ సిరీస్ లో బాగుంది. కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి కానీ అవి మిగతా మంచి అంశాలు ముందు పెద్దగా నిలబడవు. సో ఒక డీసెంట్ సిరీస్ ని అది కూడా ఫ్యామిలీతో కలిసి చూడాలి అనుకునే వారు జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ ని చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు