కరోనా లాక్‌డౌన్ కారణంగా సినీమా రంగం పూర్తిగా షట్‌డౌన్ అయ్యింది. ఫ్రీ టైమ్ దొరికేసరికి రచయితలు, దర్శకులకు, మ్యూజిక్ డైరెక్టర్స్‌కి, కావాల్సినంత సమయం దొరికింది. దీంతో తమ తమ క్రియేటివ్ ఆలోచనలకు పదును పెడుతున్నారు చాలామంది. దర్శకులు కథలను డెవెలెప్ చేస్తుంటే.. మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త ట్యూన్స్‌ని పుట్టిస్తున్నారు. అందరికి కావాల్సినంత సమయం దొరకడంతో అందరూ నిదానంగా మెదడుకి పదును పెడుతున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌గా తీరిగ్గా కూర్చుని మరీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడట. ఈ క్రమంలో ఓ పాటను రెడీ చేసి సుక్కు అండ్ బన్నిలకు వినిపించడం, వాళ్ళకు నచ్చడం, హ్యాపీగా ఫీలవడం కూడా జరిగిందట. దీంతో ఇప్పుడు ఐటం సాంగ్‌ను కంపో చేసే పనిలో ఉన్నాడట దేవీ. మరి సుక్కు- దేవీ కాంబినేషన్‌లో ఐటం సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా కోసం ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో చూడాలి.