పవన్ సినిమాకి భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న దేవి శ్రీ


టాలీవుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. పెద్ద పెద్ద సినిమాలు చాలా వరకు ఈయన వద్దకే వెళుతుంటాయి. దర్శకులు, హీరోలు కూడ దేవి శ్రీ ప్రసాద్ అయితే తమ సినిమాలకు న్యాయం చేయగలడని నమ్ముతుంటారు. దేవి శ్రీని రిపీట్ చేసే హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలు చాలావరకు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక మ్యూజిక్ పరంగా అయితే ఇప్పటికీ ఆ చిత్రాలు టాప్ లిస్టులో ఉంటాయి. ‘జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది’ చిత్రాలు పాటలు ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలుసు.

అందుకే పవన్ తన కొత్త చిత్రానికి దేవి శ్రీని ఎంచుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేయనున సినిమాకు దేవి శ్రీ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రం కోసం దేవిశ్రీ సుమారు 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గతంలో ఈయన పారితోషకంగా ఒకటిన్నర కోటి తీసుకునేవారట. కానీ పవన్ సినిమాకు మాత్రం రెండు కోట్లు పుచ్చుకుంటున్నారట. ప్రస్తుతం పవన్ ‘వకీల్ సాబ్’ షూట్లో ఉన్నారు. దాని తర్వాత మలయాళ రీమేక్, ఆ తర్వాత క్రిష్ ప్రాజెక్ట్ చేసి హరీష్ శంకర్ సినిమాకు వస్తారు.

Exit mobile version