గోపీచంద్ తో యాక్షన్ ఎంటర్టైనర్ తియ్యనున్న దేవకట్టా

Gopichand-devakatta

‘వెన్నెల’, ‘ప్రస్థానం’ సినిమాలతో తన ప్రతిభ చూపించాడు దేవకట్టా. ఆర్. ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై అతను నాగచైతన్య తో తెరకెక్కిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఆర్ధిక ఇబ్బందుల వలన విడుదలకు నోచుకోవటం లేదు.

దేవకట్టా ఇప్పుడు మరికొన్ని కొత్త పోజెక్టులు మొదలుపెట్టనున్నాడు. టాలీవుడ్ మాచో గోపీచంద్ తో త్వరలో ఒక సినిమా తియ్యనున్నాడు. “నా తరువాతి చిత్రం గోపీచంద్ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రీతిలో తెరకెక్కబోతుందని” ట్వీట్ చేసాడు.

దేవకట్టా ‘ఆటోనగర్ సూర్య’ గురించి కుడా పెదవి విప్పాడు. ‘మీ అందరిలాగే నేను కూడా ఆటోనగర్ సూర్య రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. ‘ఆటోనగర్ సూర్య’ తొందరగా విడుదల కావాలని, అతని తరువాత ప్రాజెక్ట్ మరింత బాగా రావాలని ఆశిద్దాం

Exit mobile version