ఎప్పుడైతే ‘ఆటోనగర్ సూర్య’ సినిమా పోస్టర్లు బయటకు వచ్చాయో అప్పట్నించి ఒక ట్రక్ మన అందరి కళ్ళను ఆకర్షిస్తుంది. గాంభీర్యంగా కనిపించే ఈ వాహనాన్ని ఈ సినిమాలో నాగచైతన్య వాడనున్నాడు. . ఈ వాహనానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనకు అందాయి.
ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఈరోజు దేవ కట్టా ను కలిసినప్పుడు ఈ వాహనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. “ఈ సినిమాకోసం మేము టాటా 207 వాహనాన్ని తీసుకుని దాన్ని మాకు అనుగుణంగా మార్చుకున్నాము. పై పార్టులు అన్నీ తీసాక దానికి కొత్త లుక్ వచ్చింది” అని దర్శకుడు తెలిపాడు
‘ఆటోనగర్ సూర్య’ వచ్చే నెలలో విడుదలకానుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సమంత నటిస్తుంది. ఆర్. ఆర్ మూవీస్ మేకర్స్ నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు