ఆశ్చర్యకరమయిన విమర్శలు చేసిన దేవ కట్ట

Devakatta
దర్శకుడు దేవ కట్టా ఈరోజు కొన్ని సంచలనాత్మకమయిన విమర్శలు చేశారు. ట్విట్టర్లో అయన ఎకౌంటు నుండి దేవ కట్ట కొన్ని సంచలనాత్మక విమర్శలు చేశారు. మీకోసం వాటిని ఇక్కడ ఉంచుతున్నాం.

దేవ కట్ట చేసిన ట్వీట్లు :

” కైజర్ సోజే చిత్ర నిర్మాణం ఇలా ఉంటుంది : కొంతమంది వ్యక్తులను నియమించుకొని మనం రిచ్ అని అందరికి చెప్పేలా చెయ్యడం ఎవరో ఒక హీరో లేదా డైరెక్టర్ ని పట్టుకొని ఒక చిత్రాన్ని ఒప్పించడం. మార్కెట్ వాల్యూ “x” అయితే ఫైనాన్షియర్స్ కి “2x” అని చూపించడం. చిత్రం మీద “0.5x” ఖర్చు పెట్టడం నియమించుకున్న వ్యక్తులకు “0.5x” ఇచ్చి ముందు గాని లేదా విడుదల రోజు కాని కనపడకుండా మాయం అయిపోవడం. రికవర్ అవ్వాలనుకునే చిత్రాన్ని విడుదల చేసుకోవలసి వస్తుంది. ఇది ఒకేసారి పలు చిత్రాలను ఒక బ్యానర్ మీద కాని పలు బ్యానర్ ల మీద కాని నిర్మించే వారికి కూడా వర్తిస్తుంది. ఈ స్కం ని మారుపేరుతో కూడా నడపచ్చు ఎందుకంటే కోట్లు అప్పు తీసుకునే వాడి వివరాలను గమనిన్చుకోరు కాబట్టి” అని ట్వీట్ చేశారు.

దేవ కట్ట దర్శకత్వంలో రానున్న నాగ చైతన్య “ఆటోనగర్ సూర్య” ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది ఈ ఆలస్యం వెనుక ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ కారణంగా ఉన్నట్లు తెలుస్తుంది. దేవ కట్ట ఎవరి పేరు చెప్పలేదు కాని ఈ ట్వీట్ చూస్తుంటే అతని నిస్సహాయత కనిపిస్తుంది.

గమనిక : కైజర్ సోజే అనేది “ది యుజువల్ సస్పెక్ట్స్” అనే ఇంగ్లీష్ చిత్రంలోని పాత్ర పేరు.

Exit mobile version