తదుపరి ప్రొజెక్ట్ పై దేవాకట్టా కసరత్తు

Deva-Katta

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఆటోనగర్ సూర్య విడుదల ఆటంకాల మధ్య నలుగుతూనే వుంది. అయితే ఈ మూడ్ నుంచి అందరూ బయటకొచ్చి ఎవరిపనుల్లో వారు బిజీగానే వున్నా దర్శకుడు దేవకట్టా మాత్రం ఈ సినిమాతోనే కుస్తీ పడుతున్నాడు. ముందుగా చెప్పినట్లు ఈ చిత్రం ఈ నెల 27న విడుదలకూడా అనుమానంగానే మారింది

ఈ సినిమా గురించి దేవా కట్టా ఇలా ట్వీటిచ్చాడు ” ఆటోనగర్ సూర్య కు ఆఖరివారం. ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు” అని తెలిపాడు. తను మరో కధను సిద్ధం చేస్తున్నట్లు, దాని మొదటి డ్రాఫ్ట్ సిద్ధమయినట్లు తెలిపాడు

గోపీ చంద్ తో తన తదుపరి సినిమా వుంటుందని తాను ప్రకటించినా అక్కినేని అఖిల్ మొదటి సినిమా దర్శకుడు అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మరో మన దేవా ఏం చేస్తాడో తెలియాలంటే వేచి చూడాలిసిందే

Exit mobile version