ఏప్రిల్ 11 విడులవుతున్న ‘క్రేజీ’

ఏప్రిల్ 11 విడులవుతున్న ‘క్రేజీ’

Published on Apr 9, 2013 9:40 AM IST

crazy
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఢిల్లీ బెల్లీ’ సినిమాని తెలుగులో ‘క్రేజీ’ పేరుతో, తమిళంలో ‘సెట్టై’ పేరుతో నిర్మించారు. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఆర్య హీరోగా హన్సిక, అంజలి హీరోయిన్స్ గా నటించారు. యుటివి మోషన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి కన్నన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని లోకల్ టెస్ట్ కు తగినట్టుగా కొన్ని మార్పులు చేశారు, అలాగే సంతానం కామెడీ ఈ సినిమాకి హైలెట్ అవుతుందని బావిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ‘ఢిల్లీ బెల్లీ’ సినిమా 2011లో బాలీవుడ్ లో విడుదలై ఘన విజయాన్ని సాదించింది.

తాజా వార్తలు