రజినీకాంత్ 3D సినిమాలో దీపిక పడుకొనే

రజినీకాంత్ 3D సినిమాలో దీపిక పడుకొనే

Published on Feb 7, 2012 3:46 PM IST


బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే రజినీకాంత్ సరసన ‘రాణా’ చిత్రంలో నటించాల్సి ఉండగా రజినీకాంత్ అనారోగ్యం పాలవడంతో ఆ చిత్రం రద్దయిన విషయం తెలిసిందే. రజినీకాంత్ నటించబోయే తదుపరి చిత్రం ‘కొచడియాన్’ లో నటించడానికి ఆమె అంగీకరించారు. 3D రూపంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అధ్బుతమైన సాంకేతిక పరిజ్ఞానం గల నిపుణులు పనిచేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో శోభన, ఆది, స్నేహ మరియు పృథ్విరాజ్ వంటి ప్రముఖ నటులు నటించనున్నారు. మద్రాస్ మొజార్ట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుండి విపరీతమైన స్పందన లభించింది.

తాజా వార్తలు