రజిని స్వభావానికి ఆశ్చర్యపోయిన దీపిక

రజిని స్వభావానికి ఆశ్చర్యపోయిన దీపిక

Published on Oct 2, 2013 4:00 AM IST

deepika-padukone
బాలీవుడ్ తారగా కొనసాగుతున్న దీపికా పదుకునె మన రజిని నటిస్తున్న విక్రమ సింహాలో జంటగా నటిస్తుంది. మోషన్ క్యాప్చుర్ విధానంతో తెరకెక్కిస్తున్నా ముందుగా నటించి ఆ తరువాత యానిమేట్ చేస్తారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ “నేను ఈ సినిమా షూటింగ్ లో మూడు రోజులు మాత్రమే పల్గున్నాను. కానీ ఆ మూడు రోజులు రజిని సర్ తో కలిసి నటించాను. ఎటువంటి భేషజాలు లేకుండా ఆయన సెట్ లో అందరుతోను కలిసిపోతారు. ఇన్నిచిత్రాలు చేసినా ఇంకా ఇది ఆయన మొదటి సినిమాగా భావిస్తారు” అని తెలిపింది ఈ సినిమాకు సౌందర్య రజినీకాంత్ దర్శకురాలు. ఏ.ఆర్ రెహమాన్ సంగీతదర్శకుడు. రజిని జన్మదిన కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమా మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు