హిమాలయాలకు వెళ్ళిన దీక్షా సేథ్


పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేథ్ వేసవి నుండి తప్పించుకునేందుకు హిమాలయాలకు వెళ్ళింది. ఆటలు, సాహసంతో కూడినవి చేయడం అంటే ఇష్టపడే దీక్షా హిమాలయాలు ఎక్కడం వంటి సాహసోపేతమైన పనులు చేసింది. ట్రెక్కింగ్ క్యాంపు జాయిన్ అయిన ఆమె అక్కడ చాలా ఎంజాయ్ చేసారు. దీక్షా సేథ్ ప్రస్తుతం నటిస్తున్న మంచు మనోజ్ సరసన నటిస్తున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇదే కాకుండా ప్రభాస్ సరసన లారెన్స్ డైరెక్షన్లో ‘రెబల్’ సినిమాలో నటిస్తుంది. ee రెండు సినిమాలు వేసవిలో విడుదల కానున్నాయి. ఇవే కాకుండా తమిళంలో ‘వెట్టై మన్నన్’ అనే సినిమాలో కూడా నటిస్తుంది.

Exit mobile version