ఆగస్ట్ 8కి వాయిదా పడ్డ దేవుడు చేసిన మనుషులు?

ఆగస్ట్ 8కి వాయిదా పడ్డ దేవుడు చేసిన మనుషులు?

Published on Jul 10, 2012 12:08 AM IST


తాజా సమాచారం ప్రకారం రవితేజ, ఇలియానా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “దేవుడు చేసిన మనుషులు” చిత్రం ఆగస్ట్ 8కి వాయిదా పడే అవకాశాలున్నాయి. గతంలో ఈ చిత్రాన్ని జూలై 27న విడుదల చెయ్యటానికి సన్నాహాలు చేశారు కాని ప్రస్తుతం దాదాపుగా ఆగస్ట్ 8న విడుదల ఖరారు అయినట్టు తెలుస్తుంది. గతంలో “ఇడియట్”, “అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి” వంటి హిట్ చిత్రాల కోసం కలిసి పని చేసిన పూరి జగన్నాథ్ మరియు రవి తేజ ఈ చిత్రం కోసం పని చేశారు. ఇలియానా మరియు పూరి గతంలో “పోకిరి” మరియు ” నేను నా రాక్షసి” కోసం పని చేశారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు సుబ్బరాజ్ కూడా కీలక పాత్రలు పోషించారు. రఘు కుంచె సంగీతం అందించగా బివి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు