పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. నెక్స్ట్ లెవెల్ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఆల్రెడీ భారీ రికార్డులు సెట్ చేస్తుంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి నంబర్స్ సెట్ చేస్తున్న ఓజి ఇపుడు సీడెడ్ వసూళ్లు ఎంత వచ్చాయి అనేది తెలుస్తుంది. లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం ఓజి చిత్రంకి 10 కోట్లకి పైగా గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది.
మొత్తం జీఎస్టీ కలిపి ఓజి 10.3 కోట్ల గ్రాస్ ని అందుకుందట. దీనితో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది మరో సాలిడ్ మార్క్ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే అర్జున్ దాస్, శ్రేయ రెడ్డి ఇంకా ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.