పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే రికార్డు ఓపెనర్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే తన కెరీర్ హైయెస్ట్ వసూళ్ళని ఈ సినిమా కేవలం ఒకటీ రెండు రోజుల్లోనే దాటేసే రేంజ్ లో హైప్ లో వచ్చింది.
మరి ఇలానే నైజాం మార్కెట్ లో కూడా వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపినట్టు ట్రేడ్ వర్గాల నుంచి పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో పవర్ స్టార్ ఏకంగా 24 కోట్ల షేర్ (జీఎస్టీ కలిపి) అందుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీనితో కేవలం స్వల్ప తేడాతోనే ఓజి సినిమా ఆల్ టైం టాప్ 2 ఓపెనర్ గా నైజాం మార్కెట్ నుంచి నిలిచినట్టుగా తెలుస్తుంది. దీనితో ఓజి చిత్రం రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ ని అందుకుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.