పూరి, సేతుపతి ప్రాజెక్ట్ టైటిల్, టీజర్ కి డేట్ వచ్చేసింది!

పూరి, సేతుపతి ప్రాజెక్ట్ టైటిల్, టీజర్ కి డేట్ వచ్చేసింది!

Published on Sep 26, 2025 11:59 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లలో దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఏంటి నేపథ్యం ఏంటి అనేవి ఇంకా గోప్యంగానే ఉన్నాయి.

అయితే ఇక దీనికి ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. ఈ సినిమా తాలూకా టైటిల్ టీజర్ ఇంకా ఫస్ట్ లుక్ లని ఈ సెప్టెంబర్ 28న లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేసి సాలిడ్ అప్డేట్ అందించారు. ఇక దీనితో అంతా ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ఈ ఛార్మి, పూరిలు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు