అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!

అఫీషియల్ : కాంతార చాప్టర్ 1 ఓటీటీ డేట్ ఫిక్స్..!

Published on Oct 27, 2025 4:12 PM IST

కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్‌గా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను డివోషనల్ ఎపిక్ డ్రామాగా ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకులు కట్టిపడేసింది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగించింది.

అయితే, ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ విషయంపై అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని అక్టోబర్ 31 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, హొంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు