‘వార్ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే..?

war2

బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి రాబోతున్న స్పై యాక్షన్ చిత్రం ‘వార్ 2’కోసం యావత్ ఇండియన్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

అయితే, ఈ సినిమాను తెలుగులో నిర్మాత నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ‘వార్ 2’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు. ఆగస్టు 10న యూసుఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఈ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఈ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version