ఆడియో ఫంక్షన్స్ పై ధ్వజమెత్తిన దాసరి.!

ఆడియో ఫంక్షన్స్ పై ధ్వజమెత్తిన దాసరి.!

Published on Mar 19, 2013 4:52 PM IST

Dasari-Narayana-rao

ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా చెప్పుకునే వాళ్ళలో దర్శకరత్న దాసరినారాయణ రావు ఒకరు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో జరిగే తప్పులపై ఘాటుగా స్పందించే దాసరి ఈ రోజు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ ప్లాటినం డిస్క్ వేడుకకి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన కోన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. దాసరి మాట్లాడుతూ ‘ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతి ఆడియో ఫంక్షన్ రికార్డింగ్ డాన్సు షోస్ మాదిరిగా ఉన్నాయి. అలాంటి వేడుకలు ఇండస్ట్రీకి శ్రేయష్కరం కాదు. అందుకే నేను ఇలాంటి కార్యక్రమాలకి నేను హాజరు కావడం లేదు. ఆడియో గానీ సినిమా గానీ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని’ ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే దాసరి గారు ఓ కార్యక్రమమలో హీరోయిన్లు దర్శక, నిర్మాతలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, తమ సినిమాల ఆడియో ఫంక్షన్ లకే రావడం లేదని హీరోయిన్స్ పై సంచలన వ్యాఖలు చేసారు.

తాజా వార్తలు