మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక చిత్రం చేస్తున్న విషయం మనకు తెల్సిందే. ప్రస్తుతం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక దర్గా సెట్ ను వేసినట్లు సమాచారం. చిత్ర యూనిట్ ఈ షెడ్యుల్లో మరో రెండు రోజుల పాటు షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడీగా ఇలియానా నటిస్తుంది. అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ ఇద్దరు కలిసి ఈ చిత్రాన్ని మంచి ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. కామెడీ, డాన్సు మరియు రొమాన్స్ కు పెద్ద పీత వేస్తున్నట్లు సమాచారం. జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాత.