APFDC చైర్మన్ బరిలో దమ్మాలపాటి శ్రీనివాసరావు?

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APFDC) చైర్మన్ పదవిని భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నటుడు పోసాని కృష్ణమురళి ఈ పదవీ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవిని ఇంకా భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ పదవి బరిలో ప్రముఖ నిర్మాత, నటుడు, ఎగ్జిబిటర్ దమ్మాలపాటి శ్రీనివాసరావు(డి.ఎస్.రావు) ఉన్నట్లు తెలిసింది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ అధినేత ఆశీస్సులు కూడా ఈయనకు ఉండటం కూడా మరో ప్లస్ పాయింట్ అంటున్నారు.

పాతికేళ్ళకు పైగా సినీ పరిశ్రమతో విశేషమైన అనుబంధం ఉన్న డి.ఎస్.రావు నిర్మాతగా ఇరవైకి పైగా సినిమాలు నిర్మించారు. నాని, నితిన్, మంచు మనోజ్ వంటి పలువురు హీరో లతో ఆయన సినిమాలు నిర్మించారు.

Exit mobile version