బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ హీరోగా టాలెంటెడ్ నటుడు రణదీప్ హూడా విలన్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఊర మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రమే “జాట్”. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని సౌత్ మాస్ పవర్ ని నార్త్ ఆడియెన్స్ కి చూపించి మెప్పింపు కూడా పొందారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో 100 కోట్లకి పైగా అందుకోగా రీసెంట్ గానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది.
దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం హిందీ సహా తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇలా వచ్చిన ఈ కొంతలోనే ఓటిటిలో అదరగొడుతుంది. ఆల్రెడీ ఇండియా వైడ్ 1 నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతున్న సినిమాగా జాట్ నిలిచి ఇక్కడ కూడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే దీనికి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
The blockbuster JAAT ROAR continues ????????#Jaat is TRENDING #1 on @NetflixIndia. Witness the MASS FEAST now in Hindi and Telugu ❤️????
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial @peoplemediafcy & @ZeeStudios_
A @MusicThaman Mass Beat… pic.twitter.com/xdfPu2qW8h— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2025