బిగ్ అప్డేట్ : ‘అఖండ తాండవం’ షురూ చేస్తున్న బాలయ్య

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా అఖండ తాండవం షురూ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్‌కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈ సినిమా నుంచి రాబోయే ఈ అప్డేట్‌ను జూన్ 8న ఉదయం 10.54 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version