ప్రస్తుతం కేవలం అనౌన్సమెంట్ లతోనే ఆడియెన్స్ కి మెంటలెక్కిస్తున్న క్రేజీ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా దర్శకుడు అట్లీ కలయిక అని చెప్పవచ్చు. అనౌన్సమెంట్ వీడియో తోనే మొదటి బాల్ సిక్సర్ కొట్టిన ఈ కాంబో నుంచి లేటెస్ట్ గా హీరోయిన్ పై ఇచ్చిన అనౌన్సమెంట్ తో మరింత ఎగ్జైట్మెంట్ పెంచుకొచ్చారు.
అయితే ఈ అప్డేట్స్ చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలని సోషల్ మీడియాలో ఇతర ఫ్యాన్స్ అంటున్నారు కానీ ఇపుడు ఈ బిగ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ట్రీట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ నుంచి మరో హీరోయిన్ అప్డేట్ ని మేకర్స్ అతి త్వరలోనే ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమందే హీరోయిన్స్ ఉంటారని రూమర్స్ ఉన్నాయి. సో అలా నెక్స్ట్ కూడా హీరోయిన్ పైనే అప్డేట్ రానున్నట్టుగా ఇపుడు వినిపిస్తున్న టాక్. మరి అదెవరు అనేది వేచి చూడాలి.