మళ్లీ మారిన డమరుకం విడుదల తేది

మళ్లీ మారిన డమరుకం విడుదల తేది

Published on Nov 7, 2012 7:20 PM IST


డమరుకం చిత్రం విడుదల మరొసారి వాయిదా పడింది. టికెట్స్ ఇచ్చాక వాయిదా వెయ్యడం రెండవసారి. ఒక వారం నుండి ఈ చిత్రం నవంబర్ 9న విడుదల అవుతుంది అని చిత్ర వర్గాలు చెబుతూ వస్తున్నాయి కాని ఈ చిత్రం నవంబర్ 10 న రానుంది అని అధికారిక సమచారం ఇప్పుడే మాకు అందింది. ఈసారి వాయిదాకి కల కారణాలు చెప్పలేదు . ఆర్ధిక సమస్యలే కారణం అని తెలుస్తుంది. అక్కినేని నాగర్జున మరియు అనుష్క ప్రధాన పాత్రలలొ నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించారు. ఆర్ ఆర్ మువీ మేకర్స్ బ్యానర్ మీద వెంకట్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

తాజా వార్తలు