మళ్ళీ వాయిదా పడిన డమరుకం విడుదల

మళ్ళీ వాయిదా పడిన డమరుకం విడుదల

Published on Oct 13, 2012 11:50 PM IST

ఏదయినా చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకుల్లో ఎప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. రిలీజ్ డేట్ ప్రకటించగానే అందరు ఊపిరి పీల్చుకుంటారు కాని “డమరుకం” చిత్రంలో మాత్రం రిలీజ్ దగ్గరవుతుంది, అయినా డేట్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదల వాయిదా పడింది గతంలో ఈ నెల 19న వస్తుంది అని నిన్న ప్రకటించారు. ఈ చిత్రం 19న విడుదల కావట్లేదు. కొన్ని గ్రాఫిక్స్ కార్యక్రమాలు మిగిలిపోవడం మూలాన ఈ చిత్రం అనుకున్న తేదీలో విడుదల కాకపోవడానికి కారణం అని తెలుస్తుంది. ఈ చిత్ర సెన్సారు కూడా రఫ్ కాఫీ తో చేశారు. కొంతమంది పంపిణిదారుల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ చిత్రంకి పరిశ్రమలో మంచి టాక్ ఉంది. గ్రాఫిక్స్ మరియు కథ ఈ చిత్రంలో మంచి బలమయిన అంశాలు అని అంటున్నారు. 40 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం నాగార్జున కెరీర్లోనే ఖరీదయిన చిత్రం ఇది. ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు మాకు తెలిసిన వెంటనే మీకు సమాచారం అందిస్తాం.

తాజా వార్తలు