‘మనం’ కోసం మనమేకాదు, వాళ్ళు కూడా వెయిటింగ్ అంట…

manam
అక్కినేని వంశంలో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా మనం ఈ వేసవిలో సందడి చెయ్యనుంది. అక్కినేని వారి మూడు తరాలనటులు ఈ సినిమాలో కనిపించి మనల్ని అలరించనున్నారు. ఈ సినిమాలో నటీనటులేకాక ఈ చిత్రాబృందమంతా ఈ సినిమా విడుదలకోసం ఎదురుచూడడం విశేషం

“ఈ సినిమా మాకు చాలా విధాలుగా ప్రత్యేకం” అని సినిమాలో పనిచేస్తున్న బృందంతెలిపారు. నాగేశ్వరరావుగారు, నాగార్జున, నాగ చైతన్య, శ్రేయ, సమంత ఈ మనం లో ప్రధాన పాత్రధారులు

విక్రమ్ కుమార్ దర్శకుడు. హర్షవర్ధన్ సంభాషణలు అందిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. నాగార్జున ఈ సినిమాను రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్ సౌజన్యంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు

Exit mobile version