ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని చాలా పకట్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా షూటింగ్ కోసం సన్నద్ధం అవుతున్న ఈ సినిమాపై గత కొన్ని రోజుల నుంచి పలు గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే వాటిలో ఈ చిత్రాన్ని బహుశా ప్లాన్ చేస్తే పాన్ ఇండియన్ ఫ్లిక్ గా చేయనున్నారని టాక్ వినిపించింది. దీనితో ఈ సినిమాతోనే మహేష్ పాన్ ఇండియన్ ఎంట్రీ ఉండొచ్చని ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పుడు అదే నిజం అవుతుందేమో అన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇపుడు సర్కారు వారి పాటలోని విలన్ గా బాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ అండ్ సీనియర్ నటుని పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మహేష్ ఈ సినిమాతోనే పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వనున్నరని వచ్చిన టాక్ లో నిజం ఉండొచ్చని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ క్రేజీ అంశంపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.