పూరి ఏకంగా సల్మాన్ ని లైన్ లో పెట్టాడా?

పూరి ఏకంగా సల్మాన్ ని లైన్ లో పెట్టాడా?

Published on May 24, 2020 10:24 AM IST

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పై క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఆయన ఏకంగా సల్మాన్ తో మూవీ చేయనున్నాడనేది దాని సారాంశం. విషయంలోకి వెళితే పూరి జగన్నాధ్ లాక్ డౌన్ పీరియడ్ లో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పూరి స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ స్క్రిప్ట్ బాలీవుడ్ హీరోలను దృష్టిలో పెట్టుకొని ఆయన సిద్ధం చేస్తున్నారన్న న్యూస్ కూడా వినిపించింది. కాగా పూరి రాసిన ఆ స్క్రిప్ట్ సల్మాన్ కోసమట. దాదాపు ఈ ప్రాజెక్ట్ కూడా ఒకే అయ్యిందట. సల్మాన్ కమిటైన రెండు చిత్రాల చిత్రీకరణ అనంతరం ఆయన పూరితో మూవీ చేయవచ్చని తెలుస్తుంది.

ఇక గతంలో పూరి జగన్నాధ్ అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రం తెరకెక్కించారు. అది అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే పూరి మహేష్ తో తెరకెక్కించిన పోకిరి మూవీని హిందీలో సల్మాన్ వాంటెడ్ గా రీమేక్ చేశాడు. దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించిన ఆ మూవీ సల్మాన్ ఖాన్ కి భారీ బ్రేక్ ఇచ్చింది. అప్పటి వరకు వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న సల్మాన్ ఖాన్ ఆ సినిమాతో విజయంతో ట్రాక్ లోకి వచ్చారు. మరి నిజంగా ఈ ప్రాజెక్ట్ ఒకే అయితే పూరి రేంజ్ మరో మెట్టు ఎక్కినట్లే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు