టాలీవుడ్ కింగ్ నాగార్జున అలాగే ధనుష్ లు ప్రధాన పాత్రల్లో రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కుబేర”. మరి డీసెంట్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం తెలుగు సహా తమిళ ఆడియెన్స్ కూడా అంతే ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
ఒక బిచ్చగాడికి, బిలినియర్ కి నడుమ సాగే యుద్ధం కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో మంచి ప్రీ సేల్స్ ని రాబడుతుంది. ఇలా ప్రీమియర్స్ కి గాను జరుగుతున్న ప్రీ సేల్స్ లో కుబేర లక్ష 50 వేల డాలర్స్ మార్క్ దాటి 2 లక్షల మార్క్ దిశగా వెళుతుంది. మొత్తానికి మాత్రం కుబేర యూఎస్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా జూన్ 20న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.