మహేష్ కి విలన్ ఆ స్టార్ హీరో,,?

మహేష్ కి విలన్ ఆ స్టార్ హీరో,,?

Published on Jun 10, 2020 10:56 PM IST

చాలా రోజులు కొత్త సినిమా ప్రకటన చేయనకుండా ఊరించిన మహేష్, లేటైనా ఫ్యాన్స్ ని అలరించాడు. దర్శకుడు పరుశురామ్ తో ఆయన ప్రకటించిన సర్కారు వారి పాట టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కి మంచి స్పందన దక్కింది. మహేష్ ని దర్శకుడు పరుశురాం సరికొత్తగా పరిచయం చేస్తాడు అనే భరోసా వారిలో కలిగింది. కాగా ఈ చిత్రంలో విలన్ గా కన్నడ స్టార్ హీరో సుధీప్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథలో కీలకమైన విలన్ పాత్రకు సుధీప్ అయితే బెటర్ ఛాయిస్ అని వారు భావిస్తున్నారట.

మరి ఇదే కనుక నిజం అయితే తెరపై మహెహ్ హీరోయిజం, సుధీప్ విలనిజం ఓ రేంజ్ లో పండనున్నాయి. దీనిపై కొద్దిరోజులలో స్పష్టత వచ్చే సూచనలు కలవు. ఇక సర్కారు వారి పాట చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తుంది. మహేష్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు