ప్రభాస్ ‘ఫౌజీ’లో మరో హీరోయిన్ ?

ప్రభాస్ ‘ఫౌజీ’లో మరో హీరోయిన్ ?

Published on Mar 17, 2025 10:01 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని, పైగా ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర అని.. ఇప్పుడు ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. అలాగే, ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే హను రాఘవపూడి సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు