దీపికా స్థానంలో వచ్చే హీరోయిన్ ఎవరు ?

Kalki

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడీ” బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. అటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఐతే, దీనికి కొనసాగింపుగా ‘కల్కి 2’ రానున్న విషయం తెలిసిందే. ఐతే, కల్కి 2 నుంచి దీపిక పదుకోన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె స్థానంలో ఎవ్వర్ని తీసుకుంటారో అని ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. ప్రధానంగా ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు అనుష్క. బాహుబలి తర్వాత ప్రభాస్ తో అనుష్క మళ్లీ కలిసి నటించలేదు.

సో.. దీపిక పదుకోన్ స్థానాన్ని అనుష్కతో భర్తీ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. మరోవైపు నయనతార, సమంత, అలియా భట్ లాంటి పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి చివరకు ఏ హీరోయిన్ ఫైనల్ అవుతుందో చూడాలి. ‘కల్కి సీక్వెల్‌’కు ‘కర్ణ 3102 బీసీ’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్ లో పురాణాల లెంగ్త్‌ ఎక్కువగా ఉంటుందట. ఎలాగూ కల్కి ఎండింగ్ ను కూడా కర్ణుడు పాత్ర పై ముగించారు కాబట్టి, కల్కి సీక్వెల్ మొత్తం కర్ణ పాత్ర చుట్టూ తిరుగుతందనే అనుకోవాలి.

Exit mobile version