ట్రైలర్ టాక్ : గ్రాండ్ విజువల్స్ అండ్ ఎమోషన్ తో ఆకట్టుకున్న ‘కాంతార 2’ !

కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన “కాంతార” చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నడ లోనే కాకుండా ‘కాంతార’ అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్లు సాధించి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, తాజాగా ఈ సీక్వెల్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది.

కాంతార ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్.. ‘నాన్న ఎందుకు ఇక్కడే మాయమయ్యాడు ?’ అంటూ మొదలైంది. మెయిన్ గా ఈ ట్రైలర్.. గ్రాండ్ విజువల్స్ తో పాటు షార్ప్ షాట్స్ అండ్ సాలిడ్ బిజీఎమ్ తో చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో ఇచ్చిన నేటివిటీ టచ్ అండ్ ఎమోషన్ కూడా చాలా బాగుంది. 2 నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ అభిమానులు ఆశించిన స్థాయిలోనే చాలా బాగుంది. ఉత్కంఠను కలిగించే విధంగా ప్రతి షాట్ సాగింది. దీనికి తోడు మేకింగ్ స్టైల్ అండ్ మెయిన్ కంటెంట్ కూడా ఆకట్టుకున్నాయి.

తెలుగులో ఈ సినిమా గీత ఆర్ట్స్ ద్వారా రిలీజ్ అవుతుండగా, నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ మైత్రీ ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. మొత్తమ్మీద ఈ సినిమా ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను పెంచింది.

‘కాంతార 2’ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version