సెన్సేషనల్ స్టార్ ‘విజయ్ దేవరకొండ’ కేవలం తన యాక్టింగ్ అండ్ ఆటిట్యూడ్ తోనే స్టార్ డమ్ ను సొంతం చేసుకుని స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే ఈ సెన్సేషనల్ హీరో తమ్ముడు ‘దొరసాని’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఆనంద్ దేవరకొండ’ హీరోగా మెప్పించలేకపోయాడని విజయ్ ఫ్యాన్స్ సైతం ఫీల్ అయ్యారు. బలమైన నేపథ్యంలో భావేద్వేగమైన ప్రేమ కథతో తెరకెక్కిన దొరసాని చిత్రంలో ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఆనంద్ మాత్రం ప్రస్తుతం రెండవ సినిమా చేస్తూనే.. మూడవ సినిమాకు కూడా సైన్ చేశాడు.
కాన్సెప్ట్ బేస్డ్ కథగా ఉంటుందట. షార్ట్ ఫిలిం మేకర్ దామోదర అట్టాడ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా గురించి ఆనంద్ దేవరకొండ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నా డట. అందులో పాత్ర తనకు బాగా నచ్చిందట. కాగా టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఆనంద్ ఏదో భిన్నమైన కథనే చేయబోతున్నాడన్నమాట. మరి తన అన్నయ్య సపోర్ట్ తో వస్తోన్న ఈ విలువైన అవకాశాలని జూనియర్ దేవరకొండ ఈ సారైనా సద్వినియోగ పరుచుకుంటాడా.. చూడాలి.